Jos Buttler: మళ్ళీ శతక్కొట్టిన బట్లర్

ఐపీఎల్‌ 2022లో రాజస్తాన్‌ రాయల్స్‌, కేకేఆర్‌ మధ్య ఆసక్తికర పోరులో పరుగుల వరద పారింది.

  • Written By:
  • Publish Date - April 18, 2022 / 10:58 PM IST

ఐపీఎల్‌ 2022లో రాజస్తాన్‌ రాయల్స్‌, కేకేఆర్‌ మధ్య ఆసక్తికర పోరులో పరుగుల వరద పారింది. రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల చేసింది. రాయల్స్ ఓపెనర్ జాస్‌ బట్లర్‌ 61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సయంతో 103 పరుగులతో ఈ సీజన్‌లో రెండో సెంచరీ సాధించగా.. సారథి సంజూ శాంసన్‌ 38 పరుగులు చేశాడు. ఇక ఇన్నింగ్స్ చివర్లో హెట్‌మైర్‌ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులతో అదరగొట్టాడు. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 2, శివమ్‌ మావి, పాట్‌ కమిన్స్‌, రసెల్‌ తలా ఒక​ వికెట్‌ తీశారు

ఈ సీజన్‌లో బట్లర్ భీకర ఫామ్ లో ఉన్నాడు. తొలుత సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 35 పరుగులు చేసిన బట్లర్, ముంబయి ఇండియన్స్ పై 100 పరుగులు అలాగే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులు సాధించాడు. అంతే కాకుండా లక్నో సూపర్ జెయింట్స్ పై 13 పరుగులు గుజరాత్‌ టైటాన్స్ పై 54 పరుగులు తాజాగా కేకేఆర్ పై 103 పరుగులు చేశాడు. ఈసారి ఐపీఎల్ లో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 375 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లు జాస్ బట్లర్, దేవదత్ పడిక్కల్ తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత దేవ్ దత్ పడిక్కల్ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 24 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ బట్లర్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే అనూహ్యంగా సంజూ శాంసన్ 38 పరుగుల వద్ద రసెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే ఇన్నింగ్స్ చివర్లో శిమ్రాన్ హెట్మెయర్ దుమ్మురేపాడు. కేవలం 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.