Site icon HashtagU Telugu

Joe Root: ఇంగ్లండ్ టెస్టు జట్టుకు జో రూట్‌ గుడ్ బై

ICC Test Rankings

ICC Test Rankings

జో రూట్‌.. ఇంగ్లండ్‌ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్సీకి శుక్రవారం గుడ్ బై చెప్పాడు. ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.కుటుంబీకులు, సన్నిహితులతో చర్చించాకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా తో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఘోర పరాభవం, ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనలో ఓటమి అనంతరం కెప్టెన్సీ నుంచి రూట్‌ తప్పుకోవాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే రూట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు(64) ఆడిన ఆటగాడిగా రూట్‌  రికార్డు సృష్టించాడు. తన ఐదేళ్ల కెప్టెన్సీ లో జట్టుకు 27 విజయాలు అందించి అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.కాగా, ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్సీ కి అలిస్టర్ కుక్
రాజీనామా చేసిన తర్వాత 2017లో జో రూట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.