అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఎవరూ లేకపోయినా…షేక్ హ్యాండ్ ఇస్తున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ మధ్యే అమెరికా అధ్యక్షుడు స్పెషల్ గెస్టుగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసంగించిన ఆనంతరం..తన ఫైన్ ను మూసేసారు. వెంటనే పక్కన ఎవరూ లేకపోయినా…షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్లి పోయారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. అయితే అమెరికా ప్రెసిడెంట్ ఇలా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా…చాలా మందికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఆ ధ్యాసలోనే ఉన్న బైడెన్ అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్లారని అంతా భావిస్తున్నారు.
కాగా బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై తరచుగా ఏదోక న్యూస్ బయటకు వస్తూనే ఉంటుంది. లేటెస్టుగా ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆయన డిమెన్షియా బాధితుడిలా ఉన్నారని అక్కడి పొలిటికల్ పార్టీలు విమర్శించడం ప్రారంభించాయి. అంతేకాదు ఈ ఘటనపై చాలామంది సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు కొంతమంది ప్రత్యేకంగా వీడియోలు కూడా చేస్తున్నారు.
🇺🇸 US President Joe Biden got into an akward situation by trying to shake hands with 😅😂🤣??#JoeBiden #HandShake pic.twitter.com/ZTEPkHLAcJ
— NOISE ALERTS (@NoiseAlerts) April 15, 2022
