Site icon HashtagU Telugu

Hyderabad Metro Jobs Notification: హైదరాబాద్ మెట్రోలో జాబ్స్.. ఏమేం పోస్టులు ఉన్నాయంటే..

Jobs In Hyderabad Metro.. What Are The Posts..

Jobs In Hyderabad Metro.. What Are The Posts..

Hyderabad Metro Jobs Notification : హైదరాబాద్ మెట్రోలో జాబ్స్ (Hyderabad Metro Jobs) భర్తీకి ప్రకటన రిలీజ్ అయింది. ఏఎమ్‌ఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 12 పోస్టులకుగానూ జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

ఏఎమ్‌ఎస్ ఆఫీసర్‌:

వ్యాపార విశ్లేషకుడిగా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మంచి అనుభవం కలిగి ఉండాలి. ఐబిఎం మ్యాక్సిమో సాఫ్ట్ వేర్ లో నైపుణ్యం ఉండాలి. అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

సిగ్నలింగ్ టీమ్‌:

సిగ్నలింగ్ టీమ్‌లో చేరాలంటే ఎస్‌ఐజి, సిఓఎం, ఏఎఫ్‌సి నిర్వహణలో డిప్లమా ఇంజనీర్‌గా కనీసం 4 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అయిండాలి.

రోలింగ్ స్టాక్ టీం లీడర్:

రోలింగ్ స్టాక్ టీం లీడర్ పోస్టు కోసం అప్లై చేసే అభ్యర్థులు ఇంజనీర్- మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లమా లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ మెయింటనెన్స్‌లో 4 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. సాంకేతికత ఆధారిత రైలు, మెట్రో, పారిశ్రామిక వాతావరణంలో పనిచేసే పరిజ్ఞానం ఉండాలి.

ట్రాక్స్ టీం లీడర్‌:

బీఈ, బీటెక్ పూర్తి చేసి నాలుగు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. లేదంటే ఇంజనీరింగ్ డిప్లమా చేసిన వారికి ట్రాక్ నిర్వహణలో 4 నుంచి 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. సివిల్ లేదా మెకానిక్‌లో డిప్లమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

ఐటీ ఆఫీసర్‌:

బీటెక్, ఐటీ, ఎమ్‌సిఏ, ఐటీ, ఎమ్‌సిఏ-ఐటీ పూర్తి చేసి ఉండాలి. బహుళజాతి, సర్వీసెస్ కన్సల్టింగ్ పరిశ్రమల్లో 1-2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

జాబ్స్ ఖాళీల వివరాలివీ:

మొత్తం ఖాళీలు – 12
ఏఎమ్‌ఎస్ ఆఫీసర్ – 1
సిగ్నలింగ్ టీమ్ – 2
రోలింగ్ స్టాక్ టీం లీడర్ – 6

దరఖాస్తు విధానం:

జాబ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హతలు కలిగిన వారు KeolisHyd.Jobs@keolishuderabad.com మెయిల్‌కు తమ బయోడేటాను పంపించాలి.

Also Read:  NCB Recruiting: నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరోలో 98 జాబ్స్.. ఆ ఉద్యోగులు అర్హులు