Site icon HashtagU Telugu

DCCB Job Notification: DCCB విజయనగరం లో జాబ్స్.. ఏప్రిల్ 15 లాస్ట్ డేట్

Jobs In Dccb Vizianagaram.. April 15 Last Date

Jobs In Dccb Vizianagaram.. April 15 Last Date

DCCB Job Notification : విజయనగరం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (DCCB) లో జాబ్స్ భర్తీ జరుగుతోంది. మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ కు సంబంధించిన మొత్తం 58 పోస్టులను నింపుతున్నారు. ఈ పోస్టులన్నింటికీ విడివిడిగా అధికారిక నోటిఫికేషన్ వెలువడింది.మార్చి 30 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది. ఏప్రిల్ 15 లాస్ట్ డేట్.అర్హత గల అభ్యర్థులు విజయనగరం DCCB అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

SC/ST/PC/EXS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 413, జనరల్/BC అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.590 ఉంది. దీనికి సంబం ధించిన ఎగ్జామ్ మే లేదా జూన్ లో ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఉత్తీర్ణు లైన అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్‌కు హాజరవుతారు.అర్హత సాధించిన వారికి నెలకు రూ.17,900 నుంచి రూ.47,920 వరకు జీతం చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌ లో చెక్ చేసుకోవచ్చు.

మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లకు అర్హతలు

  1. అభ్యర్థి వయసు కనిష్టంగా 18 సంవత్సరాలు – గరిష్టంగా 30 సంవత్సరాలు.
  2. 65% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్.
  3. పీజీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
  4. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ వంటి విభాగాల్లో అర్హతలు.
  5. ముంబైలోని IIBF నుండి డిప్లొమా వంటి అదనపు అర్హతలు.
  6. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  7. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

స్టాఫ్‌ అసిస్టెంట్‌/ క్లర్క్‌ జాబ్ వివరాలు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్. ఆంగ్ల భాషా పరిజ్ఞానం, స్థానిక భాష (తెలుగు) లో ప్రావీణ్యం అవసరం. కంప్యూటర్ల పరిజ్ఞానం తప్పనిసరి. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

రాత పరీక్ష విధానం..

మొత్తం 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు గంట వ్యవధిలో 100 మార్కులకుగానూ పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌, రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

Also Read:  ISRO Job Notification: ఇస్రో లో జాబ్స్.. నెలకు రూ.1,42,400 శాలరీ.. ఏప్రిల్ 24 లాస్ట్ డేట్