విజయవాడ మధురానగర్ కు చెందిన తుమ్మల స్వర్ణ అనే మహిళ హైకోర్టులో ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసింది.దీనిపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో మంగళవారం బాధితులు ఫిర్యాదు చేసారు. ఉపాధి వేటలో ఉన్న యువతీ యువకులే లక్ష్యంగా ఉద్యోగాల ఆశ చూపి మోసం చేస్తుంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అమాయక యువతి యువకులు లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెబుతూ ఇద్దరు మహిళలు ఒక యువకుడు నుంచి సుమారు మూడు లక్షల దాకా డబ్బులు వసూలు చేసింది.
హైకోర్టులో cpu విభాగం లో సిస్టమ్ ఆపరేటర్ మరియు క్లెర్క్ గా ఉద్యోగాలు ఇప్పిస్తానని తనకి హై కోర్ట్ లో ఒక జడ్జ్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి బాధితులు ఒక్కొకరి దగ్గర నుంచి లక్ష రూపాయిలు దాకా వసూలు చేసింది. ఉద్యోగాలు వస్తాయి ఏమో అని నమ్మిన బాధితులు నెలల తరబడి నిరీక్షించిన ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చి భాదితులు తాము మోసపోయామని గ్రహించారు. తమ నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఏదో ఒక సాకు చెప్పి రోజులు గడుపుతుండటం తో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గతంలో ఈ మాయ లేడి ఇలానే పలువురు దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి లక్షలు వసూలు చేసిందని సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
