Saving Child: ఓ పసికందును కాపాడిన ఓ వ్యక్తి బహుమతి లభించింది. బహుమతి అంటే డబ్బులు లేక ఇంకేదో కాదు.. చిన్నారిని కాపాడినందుకు అతడికి ఉద్యోగం లభించింది. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఒక పెద్దవాడి ఓ చిన్నారిని స్ట్రోలర్ లో పెట్టుకుని వెళుతుంది. అయితే బలంగా గాలి వీయడంతో ఆమె కారు రోడ్డుపైకి వెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి కారు నుంచి కిందపడిపోతుండగా.. ఓ వ్యక్తి వచ్చి చిన్నారిని రక్షించాడు. దీంతో చిన్నారిని కాపాడినందుకు అతడికి ఉద్యోగం దక్కింది.
రోన్ వెస్‌మ్యాన్ అనే వ్యక్తి ఆపిల్‌బీ అనే రెస్టారెంట్‌కు ఉద్యోగం కోసం వెళ్లాడు. ఇంటర్వ్యూ పూర్తి కాగానే బయటకు వస్తుండగా కారులో నుంచి ఒక చిన్నారి బయటకు పడుతున్నట్లు దృశ్యం చూశాడు. దీంతో వెంటనే వెళ్లి ఆ చిన్నారిని రక్షించాడు. దీంతో అతడి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో రెస్టారెంట్ వాళ్లు అతడిని పిలిచి ఉద్యోగం ఇవ్వడంతో రోన్ వెస్ మ్యాన్ ఎగిరిగంతేశాడు. చిన్నారిని కాపాడటానికి అతడు చేసిన ప్రయత్నానికి తగ్గ ఫలితం ఇలా ఉద్యోగం రూపంలో వెంటాడుతూ వచ్చింది.
రోన్ నెస్‌మ్యాన్‌ను సొంతిళ్లు లేదు. దీంతో దాదాపు గత ఎనిమిది ఏళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఉండటానికి సొంత ఇల్లు లేకపోవడంతో దగ్గరి బంధు ఇంట్లో ఉంటూ ఉద్యోగం కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో రెస్టారెంట్ లో ఇంటర్వ్యూకు వెళ్లిన అతడికి ఆపదలో ఉన్న చిన్నారి కంటపడింది. దీంత చిన్నారి రక్షించి రియల్ హీరో అనిపించుకున్నాడు. దాంతో పాటు అతడికి ఉద్యోగం కూడా దక్కింది. మనం మంచి పని చేస్తే అదృష్టం అదే వస్తుందని చెప్పడానికి ఇతడే ఉాదాహరణ అచి చెప్పవచ్చు.
చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యక్తి ప్రయత్నాలను అందరూ ప్రయత్నిస్తున్నారు. రియల్ హీరో అంటే ఇతడే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.