Private Jobs: ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల కోతలు… ఓ గూగుల్‌ ఉద్యోగికి మెసెజ్‌ చూసి షాక్!‌

ప్రపంచ వ్యాప్తంగా మాద్యం ఏర్పడింది. దీంతో ఉద్యోగాల కోత మెుదలైంది. టెక్ కంపెనీల్లోని ఉద్యోగుల జీవితాలు కత్తిమీదసాములా తయారయ్యాయి. ఉద్యోగం ఎప్పుడు

  • Written By:
  • Publish Date - February 26, 2023 / 09:44 PM IST

Private Jobs: ప్రపంచ వ్యాప్తంగా మాద్యం ఏర్పడింది. దీంతో ఉద్యోగాల కోత మెుదలైంది. టెక్ కంపెనీల్లోని ఉద్యోగుల జీవితాలు కత్తిమీదసాములా తయారయ్యాయి. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ ఉపక్రమించింది. ఇప్పుడు తాజాగా చర్యలకు ఉపక్రమించింది. దీంతో ఉద్యోగులు సామాజిక
మాధ్యమాల వేదికగా తమ గోడువెల్లబోసుకుంటున్నారు.

లక్షల రూపాయల జీతాలు తీసుకునే సాప్ట్‌వేర్‌ ఉద్యోగులకు గడ్డుకాలం దాపరించింది. అగ్రదేశాల్లో ఆర్థిక పరిస్థితులు నానాటికి దిగజారిపోగా ఆ ప్రభావం ఉద్యోగులపై పడుతోంది. ఇప్పటికే పలు అగ్రశ్రేణి కంపెనీలు మెయిళ్ల ద్వారా ఉద్యోగాల కోతపై సిబ్బందికి తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల్లో ఆందోళన మెుదలైంది. తాజాగా ఓ ఇన్సిడెంట్‌ వింటే ఉద్యోగం చేసే వారందిరికీ షాక్‌కు గురి చేస్తోంది.

గుడ్గావ్‌లో గూగుల్ క్లౌడ్ ప్రోగ్రాం మేనేజర్‌గా పని చేస్తున్న వాలియా అనే ఉద్యోగిని కంప్యూటర్ ఆన్ చేసి లాగిన్ అవ్వగానే ‘యాక్సెస్ డినైడ్’ అనే మెసేజ్ డిస్‌ప్లే అవ్వడంతో కంగుతిన్నారు. ఇదే విషయాన్ని బాస్ దృష్టికి తీసుకెళ్తే ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పారు. ఈ మేరకు వచ్చి న మెయిల్ చెక్ చేసుకోమని అన్నారు. ఆమె సంస్థలో చేరి ఇటీవలే 5 ఏళ్లు పూర్తయిందట. అంతలోనే ఉద్యోగం నుంచి తొలగించడంతో ఉద్వేగానికి గురయ్యారు. కొత్త ఉద్యోగం కోసం లింక్డిన్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు.

గూగుల్‌లో పని చేయడమన్నది తన కల అని చెప్పిన ఆమె… అందులో ఉద్యోగం సంపాదించడంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయానంది.
అంతలోనే ఆశలన్నీ ఆవిరైపోయాయని చెప్పుకొచ్చారు. ఇకపై నా పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. అమ్మా ఎందుకు
డ్యూటీకి వెళ్లడం లేదని నా ఆరేళ్ల కూతురు అడుగుతుంటే నేనేం సమాధానం చెప్పాలి. నేనేం చెప్పినా ఇప్పుడు ఆమెకు అర్థం కాదు. అమెకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంకొంత సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.