Site icon HashtagU Telugu

Earthquake: కాశ్మీర్‌లోని కత్రాలో స్వల్ప భూకంపం

Map Imresizer

Map Imresizer

జమ్మూ కాశ్మీర్‌లోని కత్రా పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున 3.28 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. కత్రా 62 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన భూకంప కేంద్రం.

భూమికి దాదాపు 5 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూమి కంపించడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. గత రెండు రోజులుగా కత్రాలో పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి.