Site icon HashtagU Telugu

Tollywood: ఆసక్తి రేపుతున్న జితేందర్ రెడ్డి సినిమా.. విడుదల ఎప్పుడంటే

Jithendar

Jithendar

Tollywood: టాలీవుడ్ నటుడు రాకేష్ వర్రే నిర్మతగా మారి ఆసక్తికర సినిమాలు అందిస్తున్నాడు. తాజాగా కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకి, అస్సలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి అని ? అని హీరో పేస్ రెవీల్ చెయ్యకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి ఆదరణ పొందాయి. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. 2024 May 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది అని చిత్ర దర్శకుడు విరించి వర్మ చెప్పారు.

ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ, ఈ సినిమా 1st లుక్ పోస్టర్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి క్యూరియాసిటీని పెంచాయి.. రాకేష్ వర్రే ఫ్యామిలీ హీరో గా ఎవ్వరికీ చెప్పొద్దూ లాంటి లవ్ స్టొరీని చేసినప్పటికీ ఇలాంటి ఒక ఆక్షన్ డ్రామా చెయ్యడం చాలా గొప్ప విషయం.

ఈ జితేందర్ రెడ్డి జగిత్యాలలో 1980లలో యదార్ధంగా జరిగిన కథ. రియల్ స్టొరీని బాగా తియ్యడానికి చాలా రీసెర్చ్ అవసరమైంది, దాని కోసం నేను మా టీం వర్క్ ఔట్స్ చేసి, రెఫెరెన్సులు తీసుకుని, పెద్ద వారి సలహాలు తీసుకుని చాలా జెన్యూన్ గా చేసిన సినిమా ఇది.. మే 3న రిలీజ్ అయ్యే ఈ సినిమాతో ఆరోజుల్లో విలువలతో కూడిన ఈ పాత్ర, దాని చుట్టూ తిరిగే కథని ఈ తరం ప్రేక్షకులకి అందించాలని చేసే ప్రయత్నమే ఈ జితేందర్ రెడ్డి.

Exit mobile version