Site icon HashtagU Telugu

Jio Debit Cards : ‘జియో’ డెబిట్ కార్డ్స్ కూడా వస్తున్నాయ్..

Jio Debit Cards

Jio Debit Cards

Jio Debit Cards : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కు చెందిన ‘జియో’ ఇప్పటికే టెలికాం, రిటైల్ రంగాల్లో దుమ్ము రేపుతోంది. ఇప్పుడు ‘జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్’ కూడా ఆర్థిక సేవల రంగంలో తనదైన ముద్ర వేసేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే వెహికల్ లోన్స్, హోం లోన్స్ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ముంబైలోని శాలరీడ్ వ్యక్తులకు, స్వయం ఉపాధి పనులు చేసుకునే వారికి లోన్స్ ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 రిలయన్స్ స్టోర్లలో గృహ వినియోగ వస్తువులపై జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ లోన్స్ ను మంజూరు చేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

త్వరలో వ్యాపారులకు కూడా లోన్లను ఇచ్చేందుకు జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ ప్రణాళిక రచిస్తోంది. 24 ఇన్సూరెన్స్ కంపెనీలతో జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పేమెంట్‌ విభాగం సేవింగ్స్‌ అకౌంట్లను, బిల్‌ పేమెంట్‌ సర్వీసులను కూడా  రీలాంచ్‌ చేసింది. త్వరలో డెబిట్‌ కార్డులను సైతం జారీ చేయాలనే ఆలోచనలో జియో ఉంది. ఈ సేవలన్నీ వినియోగదారులు ట్రాక్ చేసుకునేందుకు ఓ యాప్‌ను కూడా జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లాంఛ్ చేయబోతోంది. ఆగస్టు నెలలోనే స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్  సంస్థ.. సోమవారం తన తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా అనలిస్టులకు ఇచ్చిన ప్రజంటేషన్‌ లో తన ఫ్యూచర్ ప్లాన్స్ ను(Jio Debit Cards) వివరించింది.

Also Read: Cricket In Olympics – 128 Years : 128 ఏళ్లకు ముందు.. ఒలింపిక్స్ లో క్రికెట్ మ్యాచ్ ల చరిత్ర !!