Zomato: “జియో-బీపీ”తో జోమాటో జట్టు.. 2030కల్లా ఫుడ్ డెలివరీకి 100% ఈవీలే!!

రిలయన్స్ జియో, బ్రిటీష్ పెట్రోలియం (బీపీ) లతో కూడిన "జియో-బీపీ" జాయింట్ వెంచర్ తాజాగా ఫుడ్ డెలివరీ కంపెనీ "జోమాటో"తో జట్టు కట్టింది.

  • Written By:
  • Publish Date - June 16, 2022 / 07:00 AM IST

రిలయన్స్ జియో, బ్రిటీష్ పెట్రోలియం (బీపీ) లతో కూడిన “జియో-బీపీ” జాయింట్ వెంచర్ తాజాగా ఫుడ్ డెలివరీ కంపెనీ “జోమాటో”తో జట్టు కట్టింది. 2030 సంవత్సరంకల్లా నూటికి నూరు శాతం ఎలక్ట్రిక్ వాహనాలతో వినియోగదారులకు ఫుడ్ డెలివరీ చేయాలని జోమాటో భావిస్తోంది.

ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు “జియో-బీపీ” ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా త్వరలో ఏర్పాటు కానున్న ఈవీ ఛార్జింగ్ హబ్ లు తోడ్పాటు ఇవ్వనున్నాయి. “జియో-బీపీ” ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ హబ్ లలో జోమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ల ఎలక్ట్రిక్ వాహనాలను రాయితీపై ఛార్జింగ్ చేసుకోవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ స్వాపింగ్ సేవలను కూడా అందించనున్నారు. కాగా, ఇప్పటికే దేశంలో అతిపెద్ద రెండు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను “జియో-బీపీ” ప్రారంభించింది. “జియో-బీపీ” పల్స్ మొబైల్ అనే యాప్ ను కూడా ఆవిష్కరించింది. ఈ యాప్ ను వినియోగించి సమీపంలోని ఈవీ చార్జింగ్ స్టేషన్లను గుర్తించవచ్చు.