Jharkhand: ఝార్ఖండ్‌ను షేక్ చేస్తున్న భాషా వివాదం.. అసలు ఏమైంది?

ప్రముఖ సంగీత ద‌ర్శకుడు ఇళ‌యారాజాకు మ‌ద్రాసు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. తన పాటలకు సంబంధించిన ఒప్పందాన్ని రెన్యుయ‌ల్ చేయ‌కుండానే..

  • Written By:
  • Publish Date - February 19, 2022 / 11:33 AM IST

ప్రముఖ సంగీత ద‌ర్శకుడు ఇళ‌యారాజాకు మ‌ద్రాసు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. తన పాటలకు సంబంధించిన ఒప్పందాన్ని రెన్యుయ‌ల్ చేయ‌కుండానే… ఎకో, అగీ ఆడియో సంస్థలు తన పాట‌ల‌తో వ్యాపారం చేస్తున్నాయన్నది ఇళయరాజా పిటిషన్. దీనిపై విచారణ జరిపిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం ఈవిధంగా తీర్పు ఇచ్చింది.

ఇళయరాజా సంగీతంలో రూపొందిన పాటలను సీడీ, క్యాసెట్ల రూపంలో విక్రయించడానికి ఎకో, అగి రికార్డింగ్‌ కంపెనీలు తొలుత ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఒప్పందం కాలం ముగిసినా దానిని రెన్యువల్ చేయకుండా ఆ సంస్థలు తన పాటలను విక్రయిస్తున్నాయంటూ ఆయ‌న 2017లో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారించిన ఏక‌స‌భ్య ధ‌ర్మాసనం ఆ సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఇళ‌య‌రాజా అప్పీలు చేయ‌గా ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఒప్పంద కాలం పూర్తయినందున‌ ఇళయరాజా పాటలతో ఎకో, అగి రికార్డింగ్‌ సంస్థలు వ్యాపారం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై ఆడియో సంస్థలు రివ్యూ పిటిషన్ దాఖ‌లు వేసుకోవచ్చంటూ వెసులుబాటు ఇచ్చింది. తదుపరి విచారణను మార్చి 31వ తేదికి వాయిదా వేసింది.

ఇళయరాజా గతంలో కూడా కోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన పాటలను చాలా చోట్ల ప్రదర్శిస్తున్నారని.. దానికిగాను తనకు రాయల్టీని ఇప్పించాలని కోరారు. కానీ ఇప్పటికే ప్రపంచం నలుమూలలా ఆ పాటలు వివిధ రూపాల్లో వెళ్లిపోయాయి. అందుకే అది సాధ్యం కాదంటూ కోర్టు చెప్పింది.