Site icon HashtagU Telugu

KCR: భారీ మెజారిటీతో జీవన్ రెడ్డి గెలుపు ఖాయం: కేసీఆర్

Cm Kcr Health Belletin

Cm Kcr Health Belletin

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆర్మూర్ లో జరిగిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆర్మూర్ ను ముంచెత్తిన జన సంద్రాన్ని చూసి ఇది జనమా ..గులాబీ వనమా అన్న భావన కలిగింది. మధ్యాహ్నం 12 గంటలకే మహిళలు, యువకులు, రైతులతో క్రిక్కిరిసిన సభాస్థలికి చేరుకోలేక రోడ్లపైనే నిలిచిన వేలాది మంది ప్రజలు “జై కేసీఆర్, జై జీవనన్న, జై తెలంగాణ” అని నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు. సభకు మహిళలు, యువకులు అధిక సంఖ్యలో రావడం విశేషం. సభకు సీఎం కేసీఆర్ నిర్ణీత సమయం కన్నా రెండు గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రజలు సభాస్థలిలోనే ఉండి వేదికపైన ఉన్న పార్టీ నేతలతో కలిసి నృత్యాలు చేశారు. జై జీవనన్న నినాదాలతో సభాస్థలి మారు మోగింది.

కాగా సభా వేదిక పైకి రాగానే ప్రజలకు అభివాదం చేసిన సీఎం కేసీఆర్ అనంతరం ప్రసంగిస్తూ ఆర్మూర్ లో జనం,జనం ప్రభంజనం అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ జన సంద్రాన్ని చూసినాక భారీ మెజారిటీతో జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని కేసీఆర్ అన్నారు. ఇదిలా వుండగా ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ తో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది. ప్రజా ఆశీర్వాద సభకు ఊహించినదాని కన్నా రెట్టింపు వచ్చి విజయవంతం చేసిన ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.