JEE Advanced Response Sheet : జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ జూన్ 4న జరిగింది. దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలిసిపోయింది.. ఈనెల 9న (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు రెస్పాన్స్ షీట్ ను(JEE Advanced Response Sheet) ఐఐటీ గౌహతి విడుదల చేయనుంది. అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్ https://jeeadv.ac.in నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పేపర్ 1, పేపర్ 2 రెండింటికీ తాత్కాలిక సమాధానాలు జూన్ 11న ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతాయి. జూన్ 11 నుంచి జూన్ 12 వరకు తాత్కాలిక సమాధానాల కీని చూసుకొని.. అభ్యర్థులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చు. వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది ఆన్సర్ కీని వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ జూన్ 18న విడుదల అవుతాయి. పరీక్షలో పొందిన మొత్తం మార్కుల ఆధారంగా ర్యాంక్ జాబితాలు రూపొందిస్తారు.
Also read : 1 Year 23 Hours : ఒక్క సంవత్సరం 23 గంటలేనట.. ఎక్కడంటే ?
JEE అడ్వాన్స్‌డ్ రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ ఇలా..
స్టెప్ 1 – jeeadv.ac.inలో జేఈఈ అధునాతన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
స్టెప్ 2 – మెయిన్ పేజీలో జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 అభ్యర్థి ప్రతిస్పందన షీట్ లింక్ కోసం వెతకండి. దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 3 – కొత్త విండోలో, అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్ వంటి లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.
స్టెప్ 4 – జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ప్రతిస్పందన షీట్ మీ స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.