Site icon HashtagU Telugu

Bihar : బీహార్‌లో బజరంగ్‌దళ్‌ను నిషేధించాలి – జేడీయూ ఎంపీ కౌశ‌లేంద్ర కుమార్‌

JDU MP

JDU MP

బీహార్‌లో భజరంగ్ దళ్‌పై నిషేధం విధించాలని బీహార్ ఎంపీ, జేడీయూ నేత కౌశలేంద్ర కుమార్ కోరారు. భజరంగ్ దళ్ లాంటి ఏదైనా సంస్థ మంచి పని చేస్తే అది మెచ్చుకోబడుతుందని తాను నమ్ముతున్నానని, అయితే ఈ సంస్థకు చెందిన వ్యక్తులు తప్పుడు పనులకు పాల్పడితే మాత్రం సహించేది లేదని ఎంపీ కౌశలేంద్ర కుమార్ అన్నారు. అందరూ రాముడిని, హనుమంతుడిని పూజిస్తారు. కానీ అతని పేరు మీద గుంపులు గుమికూడడం వల్ల అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ఆయ‌న వ్యాఖ్యానించారు. బీహార్‌లోని పాలక కూటమిలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జెడి(యు), కాంగ్రెస్.. రాబోయే కర్ణాటక ఎన్నికల కోసం ఇటీవలి మ్యానిఫెస్టోలో బజరంగ్ దళ్ వంటి ప్రముఖ సంస్థలను నిషేధింస్తామ‌ని పేర్కొంది. ఈ ప్రకటన తర్వాత భజరంగ్ దళ్ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా బీజేపీ నాయకులు ఈ ఎన్నికల వాగ్దానానికి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.