Site icon HashtagU Telugu

CM KCR: సార్ ఆకాంక్ష తెలంగాణ ప్రగతిలో ప్రతిబింబిస్తుంది: కేసీఆర్

Kcr Powder

Kcr Cap Getup

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వయం పాలనా స్వాప్నికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ వారి సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సాధన కోసం వారు చేసిన కృషి అజరామరమైనదని సీఎం అన్నారు. జయశంకర్ గారు ఆకాంక్షించిన మహోజ్వల తెలంగాణను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సమాజం ఆవిష్కరించుకుంటున్నదని, ఇది గర్వించదగ్గ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.

ఇటువంటి చారిత్రక సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు వుండి వుంటే ఎంతో సంతోషించే వారని, వారు లేకపోవడం బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. జయశంకర్ సార్ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిలో నిత్యం ప్రతిబింబిస్తూనే ఉంటుందని, తెలంగాణ అమరుల స్ఫూర్తితో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని సీఎం స్పష్టం చేశారు.