ముగిసిన 14 ఏళ్ల బంధం.. విడాకులు ప్రకటించిన ప‌వ‌ర్ క‌పుల్‌!

ప్రముఖ టీవీ జంట జై భానుశాలి- మాహి విజ్ విడిపోయారు. వీరి విడాకుల గురించి చాలా కాలంగా వస్తున్న వార్తలపై జై భానుశాలి ఎట్టకేలకు మౌనం వీడారు.

Published By: HashtagU Telugu Desk
Divorce

Divorce

Divorce: ప్రముఖ టీవీ జంట జై భానుశాలి- మాహి విజ్ విడిపోయారు. వీరి విడాకుల గురించి చాలా కాలంగా వస్తున్న వార్తలపై జై భానుశాలి ఎట్టకేలకు మౌనం వీడారు. తమ 14 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. మా బంధం విడిపోవడానికి ఎవరూ విలన్ కాదు అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

జై భానుశాలి తన పోస్ట్‌లో ఏమని రాశారు?

జై భానుశాలి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను పంచుకున్నారు. నేడు మేము జీవిత ప్రయాణంలో వేర్వేరు మార్గాలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాము. కానీ ఒకరికొకరు తోడుగా ఎల్లప్పుడూ ఉంటాము. శాంతి, అభివృద్ధి, దయ, మానవత్వం మాకు అత్యంత ముఖ్యం. మా పిల్లలు తార, ఖుషీ, రాజ్‌వీర్‌ల కోసం మేము ఎప్పటికీ మంచి తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా ఉంటాము. వారి శ్రేయస్సు కోసం సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాము అని పేర్కొన్నారు.

Also Read: సభలో అబద్ధాలు చెప్పిన సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే – హరీష్ రావు డిమాండ్

స్నేహపూర్వకంగానే విడిపోతున్నాం

మేము ఇప్పుడు కలిసి లేకపోయినా ఈ నిర్ణయంలో ఎవరి తప్పు లేదు. ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. మా మధ్య ఎటువంటి ప్రతికూలత లేదు. ప్రజలు రకరకాల ఊహాగానాలు చేసేకంటే ముందు.. మేము డ్రామా కంటే శాంతిని, అవగాహనను ఎంచుకున్నామని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మేము ఒకరినొకరు గౌరవించుకుంటూ, స్నేహితులుగా కొనసాగుతాము. మీ అందరి నుండి మాకు ప్రేమ, గౌరవం, మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నామని రాసుకొచ్చారు.

పెళ్లి ఎప్పుడు జరిగింది?

జై భానుశాలి- మాహి విజ్ 2011లో వివాహం చేసుకున్నారు. టీవీ పరిశ్రమలో వీరిని ‘పవర్ కపుల్’గా పిలిచేవారు. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత వీరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వీరికి ఆరేళ్ల కుమార్తె తార ఉంది. తారతో పాటు జై- మాహి దంపతులు ఖుషీ, రాజ్‌వీర్‌లను దత్తత తీసుకుని వారి బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు.

  Last Updated: 04 Jan 2026, 03:42 PM IST