Jasprit Bumrah: టీమిండియా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నపళంగా శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చారు. ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు భారత్ నేపాల్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కి ముందు బుమ్రా స్వదేశానికి రావడంపై ఆందోళన వ్యక్తమైంది. అసలు విషయం ఏంటంటే బుమ్రా తండ్రిగా ప్రమోట్ అయ్యాడు. బుమ్రా భార్య సంజనా గణేశన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈవిషయాన్ని బుమ్రా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. బుమ్రాకి మగబిడ్డ పుట్టడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బుమ్రా సంజనా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆసియా కప్ మెగా టోర్నీలో సూపర్-4 రౌండ్ ప్రారంభానికి ముందే బూమ్-బూమ్ బుమ్రా భారత జట్టులో చేరనున్నారు. వెన్ను సమస్య కారణంగా జస్ప్రీత్ బుమ్రా దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. వెన్నునొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. 2023 ప్రపంచకప్‌కు ముందు బుమ్రా పూర్తిగా ఫిట్‌గా తిరిగి రావడం భారత జట్టుకు ఉపశమనం కలిగించే వార్త. భారత గడ్డపై ఆడే మెగా ఈవెంట్‌లో బుమ్రా కీలకంగా మారాడు.
Also Read: Seed Ganesh: విత్తన గణపతిని నాటుదాం.. ప్రకృతిని కాపాడుకుందాం!