Site icon HashtagU Telugu

కారం ఐస్ క్రీమ్ తిన్నారా.. ఇది పూర్తిగా తింటే బిల్లు కట్టాల్సిన పనిలేదు.. తినకపోతే మాత్రం?

4663f02d F981 4787 9fa6 A3260412facb

4663f02d F981 4787 9fa6 A3260412facb

ఐస్ క్రీమ్ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తినే పదార్థం. ఈ ఐస్ క్రీమ్ ను చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక ఐస్ క్రీమ్ తయారీ సంస్థలు కూడా ప్రజల అభిరుచులకు తగ్గట్టు గానే రకరకాల ఫ్లేవర్స్ తో వీటిని అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నాయి. మిగతా అన్ని కాలాలతో పోల్చుకుంటే ఎండాకాలంలో ఐస్ క్రీమ్ కు గిరాకీ కాస్త ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకు గల కారణం భగ భగ మండే వెన్నెల్లో ఈ చల్లని ఐస్ క్రీమ్ ను తినడం వల్ల శరీరం చల్లదనం కలిగి ఉంటుంది.

మండే ఇందులో ఒక చల్లని ఐస్ క్రీం తింటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది అన్నది వర్ణనాతీతం. అయితే ఎక్కడ అయినా కూడా చల్లదనంతోపాటు స్వీట్‌గా ఉండే ఐస్ క్రీమ్ ఒక చోట మాత్రం ప్రజల నోట్లోంచి పొగలు కక్కిస్తోంది. రొటీన్‌కు భిన్నంగా హాట్‌గా స్పైసీగా ఉండే ఆ ఐస్ క్రీమ్ ను పూర్తి స్థాయిలో తినడానికి అక్కడి ప్రజలు చెమలు కక్కుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. మరి ఇంతకూ ఈ వెరైటీ ఐస్ క్రీం ఎక్కడ దొరుకుతుందంటే..జపాన్‌లో హిరాటా అనేది చిన్న గ్రామం. ఈ విలేజే హాట్, స్పైసీ ఐస్‌ క్రీంకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన ఐస్‌ క్రీం కాస్త హాట్‌గా ఉంటుంది. అయితే దీన్ని స్పైసీగా మార్చేందుకు ఇక్కడి వ్యాపారులు అత్యంత కారంగా ఉండే హబనేరో మిరప పొడిని దానిపై చల్లి కస్టమర్లకు అందిస్తారు.

అంతే కాకుండా ఇంకొక విచిత్రమైన విషయం ఏటంటే కస్టమర్లు ముందుగా తమ ఇష్టప్రకారమే ఈ ఐస్ క్రీంను తింటున్నట్టు కన్ఫర్మేషన్ లెటర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కాగా ఐస్ క్రీంను తినేందుకు ముందుకు వచ్చిన కస్టమర్లలో చాలా మంది దీన్ని పూర్తిగా తినలేకపోయారని అక్కడి ప్రజలు అంటున్నారు. అయితే ఈ ఐస్ క్రీంను పూర్తిగా తింటే మాత్రం సదరు కస్టమర్ దానికి బిల్లు చెల్లించక్కర్లేదట. ఫుకుషిమా విపత్తు అనంతరం ఈ వెరైటీ ఐస్ క్రీంను తయారు చేయడం ప్రారంభించినట్లు సమాచారం.

Exit mobile version