New Oxygen : ఆక్సిజన్.. మానవాళి మనుగడకు అతి ముఖ్యం.. ఇలాంటి ఆక్సిజన్ లో ఓ కొత్త రకాన్ని జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. జపాన్‌లోని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అణు భౌతిక శాస్త్రవేత్త యోసుకే కొండో నేతృత్వంలోని రీసెర్చ్ టీమ్ ‘ఆక్సిజన్-28’ అనే సరికొత్త ఐసోటోప్‌ను కనిపెట్టింది. అణు భౌతిక శాస్త్రంలో ఇది గొప్ప డిస్కవరీ అని, అణు ప్రయోగాలపై రీసెర్చ్ కు ఇది బాటలు వేస్తుందని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆక్సిజన్-28’ ఐసోటోప్ లోని కేంద్రకంలో 20 న్యూట్రాన్లు, 8 ప్రొటాన్లు ఉన్నాయని చెప్పారు. న్యూట్రాన్ల సంఖ్య సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఎక్కువ న్యూట్రాన్లు, తక్కువ ప్రోటాన్లు ఉండటం వల్ల ‘ఆక్సిజన్-28’ ఐసోటోప్ వెరీ స్పెషల్ అని వివరించారు.
Also read : Jobs: గుడ్ న్యూస్.. నవంబర్ నాటికి ఈ రంగాలలో 7 లక్షల మందికి ఉద్యోగాలు..!
ఫ్యూచర్ లో న్యూక్లియర్ ప్రయోగాలకు, థియేరిటికల్ ఇన్వెస్టిగేషన్‌కు ఈ మూలకం (New Oxygen) బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. చివరిసారిగా శాస్త్రవేత్తలు గుర్తించిన ఆక్సిజన్-26 ఐసోటోప్‌లో 18 న్యూట్రాన్లు, 8 ప్రొటాన్లు మాత్రమే ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడు తాము గుర్తించిన ‘ఆక్సిజన్-28’ ఐసోటోప్ లోని కేంద్రకంలో 20 న్యూట్రాన్లు, 8 ప్రొటాన్లు ఉన్నాయన్నారు. సాధారణంగానైతే ఆక్సిజన్ మూలకం ‘ఆక్సిజన్-16’ ’ ఐసోటోప్ రూపంలో అందుబాటులో ఉంటుంది.