Site icon HashtagU Telugu

Dog Man: దీన్నే పిచ్చి అంటారు…రూ.12లక్షలు ఖర్చు చేసి..కుక్కలా మారిన మనిషి…!!

Dog Man

Dog Man

పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్తే ఎలా ఉంటుంది. ఊహించడానికి కష్టంగా ఉంటుంది. కొందరి ఆలోచనా విధానంగా విభిన్నంగా ఉంటుంది. తోటివారి కంటే వారి ఆలోచనల్లో మార్పులు చాలా ఉంటాయి. అలాంటి విభిన్న ఆలోచనతో ఏకంగా శునకంలా మారాడు. జంతువులా కనిపించాలన్న తన జీవితకాల స్వప్నాన్ని నిజం చేసుకునేందుకు 12లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికి నిజం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శునకం ఫొటోలు చక్కర్లు కొడుతన్నాయి.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…జెప్పెట్ అనే సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం శిల్పాలను తయారు చేస్తుంది. మస్కట్ పాత్రల దుస్తులను కూడా డిజైన్ చేస్తుంది. ఈ మధ్యే ఆ సంస్థను ఆశ్రయించిన టోకో ఇవీ అనే వ్యక్తి తాను శునకంలా మారాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఎంత ఖర్చైనా పర్వలేదన్నాడు. అందుకు అంగీకరించిన జెప్పెట్…40రోజులపాటు కష్టపడి అతడిని కోలీ జాతి శునకంగా మార్చింది.

మేకప్ ఇతర ఖర్చుల కోసం టోకో 12లక్షలు సమర్పించుకున్నాడు. ఈ శునకం అవతారంలో ఎన్నిరోజులు ఉంటానన్న విషయంపై అతను క్లారిటీ ఇవ్వలేదు. తాను శునకంలా మారిన వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేశాడు. ట్విట్టర్ లో ఫొటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.