Site icon HashtagU Telugu

Japanese Ambassador : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ

Japanese Ambassador Suzuki

Japanese Ambassador Suzuki

గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో జపాన్ రాయబారి సుజుకి హిరోషి (Japanese Ambassador Suzuki Hiroshi) భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రాధాన్యతారంగాలు, ఉపాధి కల్పన తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జపాన్ రాయబారి మర్యాదపూర్వకంగా తనను కలిసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు, తెలంగాణ కమ్మ సామాజికవర్గం ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. కమ్మ కార్పోరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, తమ సామాజికవర్గ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇచ్చారు.

ఇదిలా ఉంటె రాష్ట్రంలో మెడికల్‌ టెక్నాలజీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా పేరొందిన ఒలింపస్‌ కార్పొరేషన్‌ హైదరాబాద్‌లో తన ఆర్‌ అండ్‌ డీ ఆఫ్‌షోర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఓడీసీ) ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసింది. అమెరికాలోని న్యూయార్కులో గురువారం కంపెనీ ఒలింపస్‌ కార్పొరేషన్‌ గ్లోబల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆర్‌అండ్‌డీ) సయ్యద్‌ నవీద్‌ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థతో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఒలింపస్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఒలింపస్ కార్పొరేషన్ పెట్టుబడులకు ముందుకు రావడం తెలంగాణకు ఒక మైలురాయిగా పేర్కొన్నారు. కంపెనీకి పూర్తి సహాయసహకారాలు అందజేస్తామని, పెట్టబడులకు తెలంగాణను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉందని , స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయని, అత్యాధునిక సాంకేతికతలతో పని చేయడానికి, వైద్య సాంకేతికతలో ప్రపంచ ఆవిష్కరణలకు దోహదపడే వేదికను అందిస్తుందని తెలిపారు. ఈ సంస్థ మరిన్ని పెట్టుబడులు, సహకారాలను ప్రోత్సహిస్తుందన్నారు.

Read Also : Chandrababu : శిష్యుడి బాటలో గురువు..?