Site icon HashtagU Telugu

Japan PM Fumio Kishida: జపాన్ ప్రధానిపై బాంబు దాడి.. తృటిలో తప్పించుకున్న ఫుమియో కిషిడా.. వీడియో

Japan PM Fumio Kishida

Resizeimagesize (1280 X 720) (1)

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా(Japan PM Fumio Kishida)పై ఘోరమైన దాడి జరిగింది. వాకయామా సిటీలో ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఒక వ్యక్తి పైప్ బాంబును ప్రధానిపై విసిరినట్లు సమాచారం. అయితే బాంబు పేలిన సమయానికి ప్రధాని కిషిడా సురక్షితంగా బయటపడ్డారు. ప్రసంగం జరగాల్సిన ప్రదేశం నుంచి కిషిడాను భద్రత బలగాలు బయటకి తీసుకొచ్చిన తర్వాతే పెద్ద చప్పుడు వినిపించినట్లు సమాచారం.

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాపై పైప్ బాంబు దాడి జరిగింది. శనివారం వాకయామాలో బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా దుండగులు బాంబు విసిరారు. భారీ శబ్ధం రావడంతో అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ దాడిలో ఎలాంటి అపాయం జరగలేదు. దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Also Read: Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా బాంబు దాడి.. 8 మంది మృతి.. 21 మందికి గాయాలు

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇందులో PM కిషిడా ప్రసంగం వినడానికి వచ్చిన వ్యక్తులు సంఘటన తర్వాత పరుగులు తీయడం చూడవచ్చు. ఈ సమయంలో పోలీసులు కూడా ఒక వ్యక్తిని నేలపై పడేలా చేయడం ద్వారా అతనిని అధిగమించడాన్ని చూడవచ్చు. ఈ ఘటనలో ప్రధానికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. తన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఓ కార్యక్రమంలో మాట్లాడేందుకు ప్రధాని వచ్చారు. పశ్చిమ జపాన్ నగరమైన వాకయామాలో ప్రధాని కిషిడా ఫిషింగ్ హార్బరును పరిశీలించిన తర్వాత ప్రసంగిస్తుండగా బాంబు పేలుడు జరిగిందని జపాన్ అధికారులు చెప్పారు. పశ్చిమ జపాన్ లోని వాకయామాలోని ఓడరేవులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.