Site icon HashtagU Telugu

Japan Vs Sex : 116 ఏళ్ళ తర్వాత లైంగిక నేరాల చట్టంలో కీలక సంస్కరణ

Japan Population Down

Japan Population Down

Japan Vs Sex : లైంగిక నేరాల చట్టంలో 116 ఏళ్ళ తర్వాత జపాన్ కీలక సంస్కరణలు చేసింది. ఇప్పటిదాకా 13 ఏళ్ళలోపు పిల్లలపై జరిగే లైంగిక దాడులను మాత్రమే రేప్ గా పరిగణించేవారు. తాజాగా సంస్కరణల్లో భాగంగా ఈ వయో పరిమితిని 16 సంవత్సరాలకు పెంచారు. దీనికి సంబంధించిన బిల్లుకు జపాన్ పార్లమెంట్ ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జపాన్ రాజ్యాంగం ప్రకారం.. రేప్ (Japan Vs Sex) అంటే “బలవంతపు లైంగిక దాడి ” అని కాకుండా, “అంగీకారం లేని లైంగిక సంపర్కం” అనే నిర్వచనం ఉంది. జపాన్ లో ఈ “అంగీకార వయో పరిమితి” గతంలో 13 ఏళ్ళు ఉండగా.. ఇప్పుడు దాన్ని 16 ఏళ్లకు పెంచారు. ఈ లెక్కన ఇకపై 16 ఏళ్లలోపు వారిపై లైంగిక దాడి జరిగితే దాన్ని రేప్ గా పరిగణించి కఠిన శిక్షలు విధిస్తారు.

Also read : Japan Population Down : జపాన్ కు “బర్త్” ఫీవర్.. తగ్గిపోతున్న జనాభా

2014లో జపాన్ రాజధాని టోక్యోలో ఒక పురుషుడు 15 ఏళ్ల అమ్మాయిని గోడకు అణచిపెట్టి, ఆమె ప్రతిఘటిస్తున్నా సెక్స్ చేశాడు. అయినా అతడికి కోర్టులో శిక్ష పడలేదు. “అతడి చర్యలు అడ్డుకోలేనంత కష్టమైనవి కాదు.. అందుకే అది రేప్ కాదు” అని కోర్టు అప్పట్లో తీర్పు చెప్పింది. ఇటువంటి కోర్టు తీర్పులను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. దీంతో స్పందించిన జపాన్ సర్కారు అంగీకార వయో పరిమితిని 16 ఏళ్లకు పెంచింది. “అంగీకార వయో పరిమితి” బ్రిటన్‌లో 16 ఏళ్ళు, ఫ్రాన్స్‌లో 15 ఏళ్ళు, జర్మనీ, చైనాలలో 14 ఏళ్లుగా ఉంది. 1907 నుంచి జపాన్‌లో అంగీకార వయో పరిమితి 13 ఏళ్లుగానే ఉంది.