Site icon HashtagU Telugu

Top News To Day: జనవరి 22వ తేదీ టాప్ న్యూస్

Top News

Top News

Top News To Day: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కాంగ్రెస్ శ్రేణులు సీఎంకు ఘన స్వాగతం పలికారు.

రాముడు జన్మస్థలంలో కొలువుతీరే పుణ్య కాలానికి సమయం ఆసన్నమైంది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది.

అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి 7 వేల మంది అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో 13 వేల మందితో అయోధ్యలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసు, ఏటీఎస్‌ కమాండోలు, సీఆర్‌పీఎఫ్‌ దళాలు, యాంటీ డ్రోన్‌ జామర్లను ఏర్పాటు చేశారు. నగరంలో పదివేల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

ట్విట్టర్ ఎక్స్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు యాప్ ద్వారా నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారింది. ఈరోజు ఛలో విజయవాడకు అంగన్వాడీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలను అడ్డుకుని అరెస్ట్‌లు చేస్తున్నారు

సూరత్‌కి చెందిన14 యేళ్ల బాలిక అయోధ్యలోని శ్రీరామ మందిరానికి ఏకంగా 52 లక్షలు విరాళంగా ఇచ్చింది. 10 సంవత్సరాల వయస్సు నుంచి రామ కథలు చెబుతూ సేకరించిన విరాళాలను అయోధ్య రామమందిరం నిర్మాణానికి విరళంగా అందించింది.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. ఓ విదేశీ మహిళా ప్రయాణికురాలి నుంచి 41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు

సంక్రాంతి సందర్భంగా చిన్న సినిమాగా రిలీజైన హనుమాన్ కు పది రోజులైనా క్రేజ్ తగ్గడం లేదు. ఈ చిత్రం పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 195 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది

నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,800 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 63,050 పలికింది. ఇక వెండి ధర 77,000 వద్ద కొనసాగుతుంది.

Also Read: Fire Accident : దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం..దగ్దమైన బస్సులు

Exit mobile version