AP : ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జనసేన విస్తృత స్థాయి సమావేశం

నేడు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది

Published By: HashtagU Telugu Desk
janasena meeting at mangalagiri today

janasena meeting at mangalagiri today

ఏపీ రాజకీయాలు ఎన్నికలను మించి అనేవిధంగా కాకరేపుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ను అరెస్ట్ చేయడం..ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను మార్చే సింది. ఇదే క్రమంలో జనసేన అధినేత (Pawan Kalyan) టీడీపీ తో కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు వైసీపీ (YCP) నేతలను చెమటలు పట్టిస్తుంది. ఓ రకంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా వైసీపీనే.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన – టీడీపీ పార్టీలు (TDP Janasena Alliance) కలిసి నిరసనలు , సమావేశాలు జరుపుతూ వస్తున్నారు. నేడు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి పార్టి కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనున్నారు. పొత్తు ప్రకటన తర్వాత మొదటిసారి పార్టీ నేతలతో పవన్ సమావేశం కాబోతున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ పోటీ చేయాలో అంచనాకొచ్చే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలలో బలమైన నియోజకవర్గం ఎంపిక చేయనున్నారని సమాచారం. కాగా, కాపు సామాజిక ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంపై పవన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను పవన్ కు చెప్పనున్నారు జనసేన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు. చంద్రబాబుతో పవన్ మాట్లాడిన అంశాలు వివరించనున్నారని సమాచారం. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజక వర్గాల ఇంచార్జులు, వీర మహిళ సమన్వయకర్తలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, సంయుక్త కార్యదర్శులు సమావేశానికి హాజరుకానున్నారు.

Read Also : NIA  Raids – Hyderabad : హైదరాబాద్ లోని ఐసిస్ సానుభూతిపరుల ఇళ్లలో ఎన్ఐఏ రైడ్స్

  Last Updated: 16 Sep 2023, 12:25 PM IST