Site icon HashtagU Telugu

CBN – Pavan : హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబుతో ప‌వన్ భేటీ.. ఉమ్మ‌డి మేనిఫెస్టోపై చర్చ‌

Babu Pawan

Babu Pawan

టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మావేశమైయ్యారు. హైద‌రాబాద్‌లోని చంద్ర‌బాబు నివాసానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాదెండ్ల మ‌నోహ‌ర్ వ‌చ్చారు. చంద్ర‌బాబు ఆరోగ్య వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం తెలంగాణ ఎన్నికలు, ఏపీలోని తాజా రాజకీయాలపై చర్చించారు. టీడీపీ – జనసేన విస్తృతస్థాయి సమావేశాల నిర్వహణపై స‌మావేశంలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఇరువురు నేత‌లు చ‌ర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. పది అంశాలతో మినీ మేనిఫెస్టో రూపొందించాలని టీడీపీ-జనసేన భావిస్తుంది. కామన్ మినిమం ప్రోగ్రాం రూపకల్పనపై కూడా స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది. ఏపీలో కరవు, ధరలు, కరెంట్ ఛార్జీలపై పోరాటం చేయాలని ఇరు పార్టీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. మద్యం, ఇసుకపై కూడా క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని జ‌న‌సేన – టీడీపీలు భావిస్తున్నాయి.

Exit mobile version