Janasena: నేడు జ‌న‌సేన విస్తృత‌స్థాయి స‌మావేశం.. కీల‌క అంశాలు చ‌ర్చించనున్న నేత‌లు

జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నేడు (శనివారం) మంగళగిరిలో జరగనుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పీఎసీ సభ్యులు, జిల్లా ఇన్‌చార్జులు పాల్గొంటారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పార్టీ మంగ‌ళ‌గిరిలోనే ఉన్నారు. శుక్రవారం ముఖ్యనాయకులతో పవన్ అంతర్గత సమావేశాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసుల బనాయింపు, జనసేన చేపట్టిన కౌలు రైతు […]

Published By: HashtagU Telugu Desk
Wmka0rim

Wmka0rim

జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నేడు (శనివారం) మంగళగిరిలో జరగనుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పీఎసీ సభ్యులు, జిల్లా ఇన్‌చార్జులు పాల్గొంటారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పార్టీ మంగ‌ళ‌గిరిలోనే ఉన్నారు.

శుక్రవారం ముఖ్యనాయకులతో పవన్ అంతర్గత సమావేశాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసుల బనాయింపు, జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర తదితర అంశాలపై చర్చించనున్నారు. కొన్ని ముఖ్యమైన తీర్మానాలకు నేతలు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది.

  Last Updated: 04 Jun 2022, 10:30 AM IST