Site icon HashtagU Telugu

Pavan Kalyan: ఈ పండుగ రైతుల్లో ఆనందం నింపాలి!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. ఇప్పటికే పట్టణాల్లో నివసించేవాళ్లు, సొంతూళ్లకు చేరడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఇవాళ భోగిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభకాంక్షలు తెలిపారు. కాగా సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ రైతుల్లో ఆనందం నింపాలని, అండగా ఉండాలని అన్నారు. జన సైనికులకు, మహిళలకు పవన్ కళ్యాణ్ గ్రీటింగ్స్ తెలిపారు.