Site icon HashtagU Telugu

Janasena: జనసైనికులకు అండగా జనసేనాని.. ప్రమాద బీమా నిధికి కోటి అందజేత

Whatsapp Image 2023 02 22 At 22.21.55

Whatsapp Image 2023 02 22 At 22.21.55

Janasena: ప్రజలతోపాటు పార్టీ కార్యకర్తలకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ అండగా ఉండారు. జనసేన పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం ఇవ్వడమే కాదు.. వారికి బీమా సదుపాయమూ కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ బీమాలో భాగంగా జనసేన క్రియాశీలక సభ్యులకు వ్యక్తిగతంగా 5 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తున్నారు.

జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు  కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పవన్‌ సేనాని కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో కోటి రూపాయల చెక్‌ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు కోశాధికారి ఎం.వి రత్నంలకు అందజేశారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, వారికీ ప్రమాద బీమా చేయించే నిమిత్తం గత రెండు ఏళ్లుగా ఏటా కోటి రూపాయల చొప్పున విరాళం అందజేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది మూడోసారి తన వంతుగా కోటి రూపాయలు విరాళంగా అందించారు.

క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న పార్టీ వాలంటీర్లకు పవన్‌ కళ్యాణ్‌ అభినందలను తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తున్న నాయకులు, వీర మహిళలు, జనసైనికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని జనసేనాని ఆకాంక్షించారు.

ఈ బీమా కింద ఎక్కడ ప్రమాదం చోటుచేసుకున్న వాయిదా ఖర్చులకు రూ.50 వేల వరకు బీమాను వర్తింపజేస్తారు. కార్యకర్తలకు బీమా విషయంలో ఎప్పుడు అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయంలో టీమ్‌ను ఏర్పాటు చేశారు. జిలాల్లోను తగిన సమాచారం అందించి వారికి సహాయపడేలా తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులను ఆదేశించారు.

Exit mobile version