Janasena : మ‌రో కార్య‌క్ర‌మంతో జ‌నంలోకి వెళ్తున్న జ‌న‌సేన‌.. ఈ సారి..?

#GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో జ‌న‌సేన మ‌రో కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో జన సేన ప్రజా సమస్యలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు డిజిట్ క్యాంపెయిన్ మొద‌ట‌లు పెట్ట‌నుంది.

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 03:17 PM IST

#GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో జ‌న‌సేన మ‌రో కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో జన సేన ప్రజా సమస్యలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు డిజిట్ క్యాంపెయిన్ మొద‌ట‌లు పెట్ట‌నుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర రహదారుల‌ పరిస్థితిపై ఆందోళనలు చేసేందుకు జనసేన ఈ కార్యక్రమాన్ని ఎంచుకుంది. ఇటీవల కాలంలో కౌలు రైతుల కోసం చేపట్టిన భరోసా కార్యక్రమం, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమం వంటి పలు కార్యక్రమాలను జనసేన చేస్తోంది. ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొంటున్నారు.

తాజాగా ‘గుడ్‌మార్నింగ్‌ సీఎంసార్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో డిజిటల్‌ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో కనీస రోడ్ల మరమ్మతులు చేపట్టడం లేదని, గాఢనిద్రలో ఉన్న ముఖ్యమంత్రిని నిద్ర లేపేందుకు గుడ్‌మార్నింగ్‌సీఎంసార్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను నిర్వహిస్తున్నామ‌ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. డిజిటల్ ప్రచారంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొంటారని తెలిపారు. రోడ్ల పరిస్థితిపై ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తామ‌ని.. పెట్రోల్‌పై రూ.750 కోట్ల రోడ్డు సెస్‌ వసూలు చేస్తున్నా ప్రభుత్వం రోడ్లపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. రోడ్ల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.