Site icon HashtagU Telugu

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండగరోజే – సాయి ధరమ్ తేజ్

Kapu Flaver

Pawan Janasena

సెప్టెంబ‌ర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రత్యేక షోస్ గా వేయబోతున్నారు. పవన్ కెరియర్ లోనే మరుపురాని చిత్రాలుగా నిలిచిన ‘జల్సా’ .. ‘తమ్ముడు’ సినిమాల స్పెషల్ షోస్ వేస్తున్నారు.

‘జల్సా’ సినిమాను సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ ను సాయితేజ్ సోషల్ మీడియాలో విడుదల చేశాడు. పవన్ మావయ్య నుంచి గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్లు రీ రిలీజ్ అవుతున్నందుకు తనకి చాలా ఆనందంగా .. ఉత్సాహంగా ఉందని .. ఫ్యాన్స్ కి ఇది పండుగరోజేనని తెలిపాడు.

ఇక తమ్ముడు చిత్రం అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో పవన్ కళ్యాణ్, ప్రీతి జింగానియా ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బి. శివరామకృష్ణ శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించాడు. రమణ గోగుల ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 15 జులై 1999న విడుదలైంది.

ఇక జల్సా మూవీ విషయానికి వస్తే త్రివిక్రమ్ డైరెక్షన్లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కింది. 2008 లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.