Site icon HashtagU Telugu

SCO meet: SCO సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి

SCO meeting

Whatsapp Image 2023 05 05 At 12.52.06 Pm

SCO meet: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం గోవాలో ప్రారంభమైంది. SCO సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు జైశంకర్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బిలావల్ భుట్టోకు ఘన స్వాగతం పలికారు. 12 ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటించారు పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌.

అంతకుముందు గురువారం భారత్ మరియు పాక్ విదేశాంగ మంత్రుల మధ్య అనధికారిక సమావేశం జరిగింది. SCO విదేశాంగ మంత్రులు ఏర్పాటు చేసిన విందులో జైశంకర్ పాకిస్తాన్ అతిథి బిలావల్ భుట్టోకు సాదరంగా స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రులిద్దరూ పరస్పరం కరచాలనం చేసుకొని ఒకరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాక్ మినిస్టర్ మాట్లాడుతూ.. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు నేను గోవా చేరుకున్నాను. స్నేహపూర్వక దేశాల నుండి నా సహచరులతో నిర్మాణాత్మక చర్చల కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నారు.