Jagtial Viral Posters: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటలో “మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త” అంటూ వాల్ పోస్టర్లతో భారీ కలకలం రేగింది. “ప్రజ మంచికోరే సంస్థ” పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అతికించారు. ఈ పోస్టర్లలో గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న మంత్రగాళ్లను చంపేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. చ్చునూతి దగ్గర మొదలుపెట్టి, గుండ్లవాడ, గౌండ్లోల్లు వంటి గ్రామాల్లోని మంత్రగాళ్లను టార్గెట్ చేస్తామని చెప్పారు.
హెచ్చరికల వివరాలు:
‘గ్రామ మంత్ర గాళ్లరా తస్మాత్ జాగ్రత్త… మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్ర గాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నం. ఆ పని గచ్చు నూతి దగ్గర ఉన్న ఇద్దరి మంత్ర గాల్ల తో మొదలు పెడతాము ఆ తరువాత గుండ్ల వాడ కట్టు, గోలొల వాడ కట్టు, గౌండ్లోల్లు, పాల కేంద్రం చుట్టూ పక్కల , మాల మాదిగల వాడ కట్టులో వున్న మంత్రగాళ్లు అందరినీ చంపుతం.. ఎవరు ఎప్పుడు ఎలా చేస్తారో మాకే తెలియదు. గ్రామ ప్రజలకు మనవి ఇప్పటి వరకు మీరు చూస్తూ ఎలా వున్నారో అలాగే వుండండి అలా కాకుండా మంత్ర గాళ్ళకు సపోర్ట్ చేశారో మీకు కూడా ప్రాణపాయం వుండొచ్చు అనేక మంది అనేక బాధలు పడుతూనే వున్నారు ఈ మంత్ర గాల్లా వల్ల ఇట్టు ప్రజల మంచికోరే సంస్థ’ అంటూ వాల్ పోస్టర్ వెలిసింది.
RG Kar Case : 11వ రోజుకు చేరుకున్న వైద్యుల నిరాహార దీక్ష.. నేడు ఆర్‌జీ కర్ కేసుపై విచారణ
పోస్టర్లు రెడ్ పెన్నుతో రాసి అతికించబడటం ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. ఇది చూసిన స్థానికులు భయపడిపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగారు. పోస్టర్లను తొలగించి, దీనిపై దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రజలకు పోలీసుల సూచనలు: పోలీసులు ఈ పోస్టర్లను పరిశీలించి ప్రజలను భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఎలాంటి అనుమానస్పద కార్యకలాపాలు కనిపించినా లేదా అనుమానాలు వచ్చినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
తరచూ పునరావృతం:
ఇదే తరహా సంఘటన రెండున్నరేళ్ల క్రితం కూడా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అప్పటి నుండి మంత్రగాళ్లపై స్థానిక ప్రజల్లో నిరసనలు, భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ తరహా హెచ్చరికలు బయటకు రావడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోస్టర్ల వెనుక ఎవరు? పోస్టర్ల వెనుక ఉన్న అసలు నిజాన్ని, ఈ హెచ్చరికలు ఎందుకు వెలువడుతున్నాయన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంత్రగాళ్లకు సంబంధించి ఉన్న ప్రజల అభిప్రాయాలు, వారిపై వస్తున్న ఫిర్యాదులు, ఇలాంటి వారిపై భయాలు కలగడంపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ప్రజల భయాందోళనలు: గ్రామాల్లో ఉన్న మంత్రగాళ్లు ఎలాంటి ప్రళయం సృష్టిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రజలు భయంతో జీవిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామాల్లో పరిస్థితి గందరగోళంగా మారింది.