Site icon HashtagU Telugu

TTD: జగన్ ఓటమి ఎఫెక్ట్.. టీటీడీ చైర్మన్ పదవీకి భూమన గుడ్ బై

Ttd

Ttd

TTD: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి చేతిలో వైఎస్సార్సీపీ ఓటమి పాలవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డికి తన రాజీనామా లేఖను సమర్పించారు. గత ఆగస్టులో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి వైసీపీ తరఫున తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చేతిలో 61,956 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తిరుపతి రాజకీయాల్లో కరుణాకర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2006 వరకు తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ గా పనిచేశారు. 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్ గా పనిచేశారు.  ఆ తర్వాత ఆయన మరోసారి టీటీడీ చైర్మన్ గా నియమితులయ్యారు.