Site icon HashtagU Telugu

Kodali Nani: 130 సార్లు జగన్ బటన్ నొక్కి 2 లక్షల 70 వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి జమ చేశారు : కొడాలి నాని

kodali nani

kodali nani

Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా, నాడు నేడు , వంటి కార్యక్రమాలతో సీఎం జగన్ ప్రజల్లో మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జగన్ చేసిన కార్యక్రమాల్లో ఒక్కటైనా చేయలేకపోయారన్నారు. లంచాలు లేని వివక్షలేని సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి పేద కుటుంబానికి సీఎం జగన్ అందించారు. 130 సార్లు బటన్ నొక్కి 2, లక్షల 70 వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి నేరుగా సీఎం జగన్ జమ చేశారన్నారు. రెండు లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే,వాటిలో మెజారిటీ ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ , నా బీసీ, మైనార్టీలకు ఇచ్చారన్నారు.

అదేవిధంగా 200 స్థానాలకు గాను 50 శాతం సీట్లను ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన జగన్ తన నిబద్ధతను నిరూపించుకున్నారన్నారు.మూడుసార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు, సామాజిక న్యాయం ఏం చేశాడో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు.చంద్రబాబు మోసాల బాబని, ఆయన కూటమి ఎలాంటిదో, 2014లో ప్రకటించిన మేనిఫెస్టో నే చెబుతుందన్నారు. ముఖ్యమైన హామీలు అని చెప్పి, ప్రజలందరినీ మోసం చేశారని, తిరిగి వస్తున్న వాళ్లను మళ్ళీ నమ్మాలా ? ప్రజలను మోసం చేయడానికి సూపర్ సిక్స్ అంటున్నారని ఎమ్మెల్యే నాని విమర్శించారు.

ఇంటింటికి బంగారం, బెంజ్ కార్, ఇస్తామంటారనీ దొంగ మాటలు ఎవరూ నమ్మవద్దని కొడాలి నాని పిలుపునిచ్చారు. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికి రావాలన్న, పేదవాడు భవిష్యత్తు మారాలి అన్న.. పథకాలన్నీ కొనసాగాలన్నా, ప్రతి పథకం మీ ఇంటికి రావాలన్న, మన పిల్లలు, మన చదువులు బాగుపడాలన్నా, మన వైద్యం ,ఆరోగ్యం, వ్యవసాయం, మెరుగుపడాలన్న రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు పైన నొక్కాలని కొడాలి నాని అన్నారు.