Site icon HashtagU Telugu

Chalovijayawada: ఊహించ‌ని జ‌గ‌న్.. స‌జ్జల అండ్ సీఎస్‌తో కీల‌క‌ భేటీ

Ys Jagan66

Ys Jagan66

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా త‌ల‌పెట్టి ఛలో విజయవాడ కార్య‌క్ర‌మం విజయవంతం అయ్యింది. దీంతో జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. దీంతో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సమావేశం అయ్యారు.

ఇక ఈ భేటీలో వైసీపీ సీనియ‌ర్ నేత‌, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈక్ర‌మంలో ఛలో విజయవాడ కార్యక్రమం గురించి జ‌గ‌న్ తెలుసుకున్నార‌ని స‌మాచారం. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల డిమాండ్లు, పెన్‌డౌన్, సమ్మె తదితర కార్యాచరణలపై సజ్జల రామ‌కృష్ణ‌తో పాటు ఇత‌ర నేత‌ల‌తో జ‌గ‌న్చర్చించారు.

అంతే కాకుండా ఈరోజు సాయంత్రం 6 త‌ర్వాత‌ గంటలకు సీఎస్ సమీర్ శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డితో చర్చించిన విషయాలపై ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొంతకాలంగా తమ డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులు, త‌ల‌పెట్టి చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం ఊహించ‌ని విధంగా విజ‌య‌వంతం చేయ‌డం గ‌మ‌నార్హం.

Exit mobile version