Site icon HashtagU Telugu

Kodali Nani: జగన్ మార్క్ ప్రతి ఇంట్లో, గ్రామంలో కనిపిస్తుంది: కొడాలి నాని

kodali nani

kodali nani

Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని జోరుగా ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు. సోమవారం తన నియోజకవర్గంలో ప్రచారం చేసి ఓటర్లనుద్దేశించి మాట్లాడారు.  కరోనా కష్టంలో కూడా.. సాకులు చెప్పకుండా…. సిఎం జగన్ బటన్ నొక్కడం ఆపలేదని గుర్తుచేశారు. మంచి చేసానన్న ఆత్మ సంతోషముతో మీ ముందు నిలబడ్డ జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.

2024లో కూడా అమలు అయ్యేవే మేనిఫెస్టోలో జగన్ పెట్టారని….. చంద్రబాబులా అబద్దపు హామీలు ఇవ్వలేదని కొడాలి నాని స్పష్టం చేశారు. జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుందన్నారు. బాబులా మోసపు వాగ్దానాలు చెయ్యరని. బాబు లాంటి మోసగాడు కావాలా.. జగన్ లాంటి నిజాయితీపరపడు కావాలో? మూడు సార్లు సీఎంగా ఏ పేదవారికి సాయం చేయని చంద్రబాబు కావాలో..? ప్రజలు తేల్చేకోవాలన్నారు.

దత్తపుత్రుడు.. ఢిల్లీ నుండి.. తెచ్చుకున్న మోడి పాంప్లేట్ 2014 లో ఇంటింటికి పంపారు. బాబు.. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేసాడా ? పొదుపుసంఘాల రుణ మాఫీ చేసాడా? ఆడపిల్లలకు ఒక్క రూపాయైనా డిపాజిట్ చేసాడా? ఇంటింటికి ఉద్యోగం.. లేకపోతే నిరుద్యోగ భృతి.. ఇచ్చాడా ? అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం అన్నాడు.. ఓక్క సెంటైనా ఇచ్చాడా? సింగపూర్ .. అభివృద్ధి అన్నాడు.. జరిగిందా ..? అని కొడాలి నాని ప్రశ్నించారు.