Kodali Nani: కరోనా కష్టకాలంలో జగన్ బటన్ నొక్కడం ఆపలేదు : కొడాలి నాని

Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ కరోనా కష్టంలో కూడా సాకులు చెప్పకుండా సిఎం జగన్ బటన్ నొక్కడం ఆపలేదని గుర్తుచేశారు. మంచి చేసానన్న ఆత్మ సంతోషంతో మీ ముందు నిలబడ్డ జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. […]

Published By: HashtagU Telugu Desk
Kodali Nani

Kodali Nani

Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ కరోనా కష్టంలో కూడా సాకులు చెప్పకుండా సిఎం జగన్ బటన్ నొక్కడం ఆపలేదని గుర్తుచేశారు. మంచి చేసానన్న ఆత్మ సంతోషంతో మీ ముందు నిలబడ్డ జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.

2024లో కూడా అమలు అయ్యేవే మేనిఫెస్టోలో జగన్ పెడతారని, చంద్రబాబులా అబద్దపు హామీలు ఇవ్వరనీ కొడాలి నాని స్పష్టం చేశారు. జగన్ మార్క్ ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుందన్నారు. మూడు సార్లు సీఎంగా ఏ పేదవారికి సాయం చేయని మోసగాడు చంద్రబాబు కావాలో..? బాబులా మోసపు వాగ్దానాలు చెయ్యని జగన్ లాంటి నిజాయితీపరపడు కావాలో ? ప్రజలు తేల్చేకోవాలన్నారు. దత్తపుత్రుడు.. ఢిల్లీ నుండి.. తెచ్చుకున్న మోడి పాంప్లేట్ 2014 లో ఇంటింటికి పంపారని అన్నారు.

బాబు.. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేసాడా ? పొదుపుసంఘాల రుణ మాఫీ చేసాడా? ఆడపిల్లలకు ఓక్క రూపాయైనా డిపాజిట్ చేసాడా? ఇంటింటికి ఉద్యోగం.. లేకపోతే నిరుద్యోగ భృతి.. ఇచ్చాడా ? అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం అన్నాడు.. ఓక్క సెంటైనా ఇచ్చాడా? సింగపూర్ .. అభివృద్ధి అన్నాడు.. జరిగిందా ..? అని కొడాలి నాని ప్రశ్నించారు.

  Last Updated: 26 Apr 2024, 06:57 PM IST