Site icon HashtagU Telugu

Lock down: నైట్ కర్ఫ్యూ పై సీఎం క్లారిటీ

Jagan

Jagan

తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూపోతుండటంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ తరుణంలో కొంతమంది కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలతో చెలరేగిపోతున్నారు.కరోనా, ఒమిక్రాన్ కేసుల విజృంభణ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చిందని.. థియేటర్లలో 50 శాతం మాత్రమే అక్యుపెన్సీ అంటూ పలు మెసేజ్‌లు వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ.. రాష్ట్రంలో ఎలాంటి నైట్ కర్ఫ్యూ లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్ చేసే వారి గురించి ఆరా తీస్తున్నామన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా, రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు తెలిపారు.

Exit mobile version