Site icon HashtagU Telugu

Jagadish Shettar: బీజేపీ కంచుకోటలో వికెట్ డౌన్.. జగదీష్ షట్టర్ రాజీనామా

Jagadish Shatter

Jagadish Shatter

Jagadish Shettar: కర్ణాటక బీజేపీలో అసమ్మతి నెలకొంది. కేంద్ర అధినాయకత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు అసమ్మతి నేతలు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షట్టర్ పార్టీకి రాజీనామా చేశారు.  అసెంబ్లీ ఎన్నికల వేళా బీజేపీ తనకు సీటు కేటాయించకపోవడంతోనే ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. హుబ్బళ్ళి-ధార్వాడ నియోజకవర్గం నుంచి షట్టర్ ఆరుసార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. అక్కడ లింగాయత్ సామజిక వర్గం బలమైనది. దీంతో అక్కడ బీజేపీ జెండా పాతుకుపోయింది.

బీజేపీ ప్రకటించిన చివరి జాబితాలోనూ షట్టర్ పేరు లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేను లేకపోతే కర్ణాటకలో 25 సీట్లు కోల్పోతుందని జోస్యం చెప్పారు జగదీష్ షట్టర్. రెండ్రోజుల నుంచి అసమ్మతి కారణంగా ఈ రోజు వరకు సమయం ఇచ్చారు. అయితే బీజేపీ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో జగదీష్ షట్టర్ పార్టీకి రాజీనామా చేసి హస్తం కండువా కప్పుకున్నారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య, ఏఐసీసీ నేత రణదీప్ సుర్జీవాలా సమక్షంలో జగదీశ్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, మల్లికార్జున ఖర్గే ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అయితే అంతకుముందు పార్టీ మారొద్దని పలువురు కేంద్ర మంత్రులు బుజ్జగించే ప్రయత్నం చేసిన్నప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కర్ణాటకలో బలమైన నాయకుడిని కోల్పోయినట్టైంది. మరి బీజేపీ అంతర్గతంగా ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో సమయమే చెప్తుంది. ఇప్పటికైతే తల్లిలాంటి పార్టీని కాదనుకున్నాడు అంటే తెర వెనుక ఎలాంటి పరిణామాలు జరిగాయో త్వరలోనే తెలుస్తుంది.