Site icon HashtagU Telugu

Telangana: పవర్ ప్రాజెక్టుల్లో అక్రమాలకు పాల్పడిన జగదీశ్ రెడ్డి జైలుకే: కోమటిరెడ్డి

Telangana

Telangana

Telangana: భదాద్రి, యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్ల అమలు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. విద్యుత్ ప్రాజెక్టుల అమలులో మరియు చత్తీస్‌గఢ్ పవర్ యుటిలిటీ నుండి విద్యుత్ కొనుగోలులో అతని పాత్ర త్వరలో బయట పడుతుందని చెప్పారు. ఈ విషయంలో జగదీశ్‌రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

బీఆర్ఎస్ కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నందున, అధికార పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నందున పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పని అయిపోతుందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ ప్రాజెక్టుల అమలు, కొనుగోలులో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ అనంతరం బీఆర్‌ఎస్‌ పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని, అలాగే జగదీశ్‌రెడ్డి జైలుకు వెళ్లనున్నారని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ 100 రోజుల్లో నెరవేరుస్తుందని, గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వచ్చే నెల నుంచి అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం, నిర్వహణా లోపంతో ఖజానాను ఖాళీ చేసిందని, హామీల అమలులో జాప్యానికి గత బీఆర్ ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు.

Also Read: Alia Bhatt’s Ayodhya Saree : వైరల్ గా మారిన ఆలియా అయోధ్య చీర..