Site icon HashtagU Telugu

Jadeja: ద్రావిడ్ నిర్ణయంపై ఫాన్స్ అసంతృప్తి

Ravindra Jadeja (1)

Ravindra Jadeja (1)

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా దుమ్మురేపింది. రోహిత్ సేన తమ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రికార్డుల ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 228 బంతుల్లో 17ఫోర్లు 3సిక్సుల సాయంతో అజేయంగా 175 పరుగులు సాధించాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా డబుల్ సెంచరీ సాధించే ఛాన్స్ ఉన్నా కూడా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.. కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ సాదించాలనుకున్న రాజపుత్ర చిరుత ఆశలపై టీమిండియా యాజమాన్యం నీళ్లు చల్లిందని అభిమానులు మండిపడుతున్నారు.

అయితే టీమిండియా క్రికెట్‌ చరిత్రలో ఓ ఆటగాడు డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోవడం ఇది రెండోసారి అని చెపుచ్చు. 2004 ముల్తాన్ టెస్టులో అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ డిక్లేర్ నిర్ణయం కారణంగా సచిన్ టెండూల్కర్‌కి ద్విశతకం చేజారింది. ఆ టెస్టులో సచిన్‌ టెండూల్కర్‌ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు అప్పటి కెప్టెన్‌ ద్రవిడ్‌ ఊహించని రీతిలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. దాంతో సచిన్‌ డబుల్‌ సెంచరీ మిస్ అయింది. ఈ మ్యాచ్ లో ద్రవిడ్‌ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా రవీంద్ర జడేజా డబుల్‌ సెంచరీ చేయకుండా మరోసారి రాహుల్‌ ద్రవిడ్‌ నిర్ణయం తీసుకోవడంతో అతనిపై అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Pic Courtesy- BCCI/Twitter

Exit mobile version