J-K: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. నియంత్రణ రేఖపైకి చొరబడేందుకు ఉగ్రవాదుల ప్రయత్నం విఫలమైంది. సైనికులు తిరగబడటంతో ఉగ్రవాదులు తోకముడిచారు. ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కెరాన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం ఆదివారం భగ్నం చేసింది. చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇరువైపులా ఎవరైనా ప్రాణనష్టం జరిగిందా అనే విషయంపై ఆర్మీ స్పష్టత ఇవ్వలేదు. కుప్వారాలోని కేరన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఈరోజు చొరబాటు ప్రయత్నం విఫలమైందని శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆపరేషన్ కొనసాగుతోంది.