RRR: ఓటీటీలోకి ‘ఆర్ఆర్ఆర్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

Published By: HashtagU Telugu Desk
Rrr Movie Ticket Rates

Rrr Movie Ticket Rates

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు గా ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఓటీటీ రిలీజ్ పై అనేక వార్తలొచ్చాయి. మే 13న రిలీజ్ అవుతుందని భావించారు అంతా. కానీ ఈ సినిమా Zee5 లో మే 20 న విడుదలవుతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ శుక్రవారం అఫిషీయల్ గా తెలిపింది.  ఈ చిత్రం మార్చి 25న థియేటర్లలో విడుదలైంది, ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 16 రోజుల్లోనే రూ. 1,000 కోట్ల క్లబ్‌లో చేరింది. పరిశ్రమ వీక్షకుల ప్రకారం  ఇది ఇప్పుడు అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చిత్రం. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘RRR’ అనేది ఇద్దరు భారతీయ స్వాతంత్ర్య సమరయోధులు (అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్) చుట్టూ తిరిగే కల్పిత డ్రామా. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

 

  Last Updated: 13 May 2022, 03:44 PM IST