Koppula: కాంగ్రెస్ పాలనలో మళ్లీ 60 ‌సంవత్సరాలు వెనక్కి పోయినట్టు ఉంది: కొప్పుల

  • Written By:
  • Updated On - April 24, 2024 / 10:08 PM IST

Koppula: పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో నేపథ్యంలో రామగుండం మాజీ 8 ఇన్ క్లైన్ లో ప్రచారం నిర్వహించి అనంతరం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఈ సమావేశంలో కొప్పుల మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత దండుగ అన్నా వ్యవసాయాన్ని పండుగ చేసింది నిజం కాదా కాంగ్రెస్ నుద్దేశించి కొప్పుల ప్రశ్నించారు.

ఇప్పుడు అసాధ్యం కాని, హామీలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో చూస్తే మళ్లీ 60 ‌సంవత్సరాలు వెనక్కి పోయినట్లు ఉందని, ఆశ పడటం తప్పు కాదు అని, ఆశపెట్టి మోసం చేయడం తప్పు అది కాంగ్రెస్ పార్టీ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ డ్రామా కంపెనీ.. ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అనుకున్నాం కాని, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని ఆగస్టు 15 ఇస్తాం అని ముఖ్యమంత్రి దేవుని పై ప్రమాణం చేస్తున్నారని సెటైర్లు వేశారు.

కాంగ్రెస్ పార్టీ పరిపాలన రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతా అంటున్న మంత్రులు ముఖ్యమంత్రి , పూర్తిగా స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారని కొప్పుల మండిపడ్డారు. ఈ అబద్దాలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ని గ్రామ గ్రామాల్లో నిలదీసే రోజులు రానున్నాయని హెచ్చరించారు కొప్పుల