IT Seizes 42 Crores : తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక డబ్బు..బెంగుళూరులో రూ.42 కోట్లు సీజ్

శుక్రవారం ఉదయం బెంగుళూర్ నుండి తెలంగాణ కు వస్తున్న రూ.42 కోట్లను అధికారులు సీజ్ చేసారు

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 10:47 AM IST

తెలంగాణలో ఎన్నికల నగారా (Telangana Assembly Elections 2023) మోగడంతో…డబ్బు, బంగారం, ఆభరణాలు, గిఫ్ట్స్ వరదలా పారుతున్నాయి. పోలింగ్‌కు పట్టుమని 50 రోజులు కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు అవసరమైన సరంజామాను సమకూర్చుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున డబ్బు తెలంగాణ కు వస్తుంది. దీంతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి అక్రమ నగదును పట్టుకుంటున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం బెంగుళూర్ నుండి తెలంగాణ కు వస్తున్న రూ.42 కోట్లను అధికారులు సీజ్ (IT Seizes 42 Crores In Bangalore) చేసారు.

బెంగుళూరు (Bangalore)లోని ఓ అపార్ట్ మెంట్ నుండి ఈ హవాలా మార్గంలో నగదును తరలిస్తున్నారని ఐటీ అధికారులకు సమాచారం అందడంతో.. సమాచారం ఆధారంగా ఐటీ అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ. 42 కోట్లు (42 cr) 22 బాక్స్ లలో తరలించేందుకు సిద్ధం చేయగా..ఐటీ అధికారులు వాటిని పట్టుకున్నారు. ఇప్పటికే రూ.8 కోట్లను తెలంగాణకు తరలించినట్టుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ మంత్రికి చెందిన డబ్బుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు ఈ కేసును ఐటీ నుండి ఈడీకి బదిలీ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఎన్నికల కోడ్ (Telangana Election Code) అమల్లోకి వచ్చిన మూడు రోజుల్లోనే..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డబ్బు, మద్యం, బంగారం, వెండి పట్టుబడటం చూస్తేనే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేశారు అధికారులు. అక్టోబర్ 9వ తేదీ నుంచి 12వ తేదీ ఉదయం వరకు మొత్తం రూ. 20,43,38,375 కోట్లు నగదు సీజ్ చేశారు అధికారులు. అదే సమయంలో రూ. 86,92,533 లక్షల విలువైన మద్యం, రూ. 89,02,825 లక్షల విలువైన డ్రగ్స్, గంజాను స్వాధీనం చేసుకున్నారు. ఇక రూ. 14,65,50,852 కోట్ల బంగారం, వెండిని సీజ్ చేశారు అధికారులు. ఇందులో 31.979 కేజీల బంగారం, 350 కేజీల వెండి, 42.203 క్యారెట్ల డైమండ్స్‌ను సీజ్ చేశారు. రూ. 22.5 లక్షల విలువైన 7,040 కేజీల రైస్, 440 చీరలు, 80 కుట్టు మెషీన్లు, 87 కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడే ఈ రేంజ్లో పట్టుబడితే..ఎన్నికల సమయం నాటికీ ఇంకెన్ని కోట్లు పట్టుబడతాయో అని లెక్కలేసుకుంటున్నారు.

Read Also : Ahmedabad Pitch: రేపే భారత్- పాక్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ పిచ్ పరిస్థితేంటి..?