ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు (Mythri Movie Makers) చెందిన కార్యాలయాల్లో ఈ ఉదయం నుంచి ఐటీ సోదాలు (IT Searches) జరుగుతున్నాయి. సంస్థ లావాదేవీల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 15 చోట్ల ఏక కాలంలో సోదాలు జరుపుతున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఇప్పటి వరకు సర్కారువారి పాట, శ్రీమంతుడు, పుష్ప, రంగస్థలం, జనతా గ్యారేజ్ వంటి హిట్ చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ ఈ సంక్రాంతికి రెండు భారీ చిత్రాలను బరిలోకి దింపుతోంది. చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహా రెడ్డి’ సినిమాలను విడుదల చేస్తోంది. మరో వైపు పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతోంది. ఇదిలావుంచితే, ఈ ఐటీ దాడులతో టాలీవుడ్ ఉలిక్కి పడింది.