IT Raids On Ponguleti: పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు.. నేడే నామినేషన్‌..!?

మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై గురువారం ఉదయం నుంచి ఐటి దాడులు (IT Raids On Ponguleti) నిర్వహిస్తుంది.

  • Written By:
  • Updated On - November 9, 2023 / 07:58 AM IST

IT Raids On Ponguleti: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై గురువారం ఉదయం నుంచి ఐటి దాడులు (IT Raids On Ponguleti) నిర్వహిస్తుంది. ఖమ్మంలోని పొంగులేటి ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి.

8 వాహనాల్లో వచ్చిన అధికారులు ఖమ్మలోని ఆయన నివాసం, కార్యాలయాలలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. పొంగులేటి సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా తనపై ఐటీ రైడ్స్ జరుగుతాయని ఆయన ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌ వంశీరామ్‌ జ్యోతి హిల్‌రిడ్జ్‌తోపాటు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని రాఘవా ప్రైడ్‌లో కూడా ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు.

Also Read: CM KCR Nominations: నేడు రెండు చోట్ల సీఎం కేసీఆర్ నామినేషన్

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీస్తున్న పొంగులేటి ఈరోజు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. ఇలాంటి సమయంలో ఆయన నివాసంతోపాటు కార్యాలయాలపై దాడులు జరగడం విశేషం. బుధవారం ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఐటీ రైడ్స్ జరుగుతుండటంతో పొంగులేటి అనుచరులు ఆయనకు మద్దతుగా ఇంటికి చేరుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తనపైనా, తన కుటుంబం పైనా ఐటీ దాడులకు అవకాశముందని పొంగులేటి బుధవారం ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై ఐటీ సోదాలు జరగవచ్చునని అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై తమపై ఐటీ దాడులకు ప్రయత్నిస్తున్నాయని పొంగులేటి పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా తనపై ఐటీ రైడ్స్ జరుగుతాయని ఆయన నిన్న తెలపగా.. ఈరోజు ఉదయాన్నే ఐటీ రైడ్స్ జరగడం గమనార్హం.